సాక్షి, భీమవరం: నూతన వధూవరులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం హాజరు అయ్యారు. భీమవరంలోని వీఎస్‌ఎస్ గార్డెన్‌లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరైన సీఎం జగన్ కొత్త జంటను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హెలికాప్టర్‌లో తాడేపల్లికి బయల్దేరారు. కాగా అంతకు ముందు ముఖ్యమంత్రికి హెలీప్యాడ్ వద్ద జిల్లా మంత్రులు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎంపీ రఘురామకృష్ణమరాజు, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఘన స్వాగతం పలికారు.
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం